Brachial Plexus | బ్రేకియల్ ఫ్లెక్సస్ సర్జరీ ద్వారా నరాల కదలిక తేవచ్చు..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Brachial Plexus | యశోద హాస్పిటల్స్‌లో (Yashoda Hospitals) అధునాతన ‘బ్రేకియల్ ప్లెక్సస్ సర్జరీ’ ద్వారా దెబ్బతిన్న నరాలను సర్జరీ చేసి, అవయవాలకు తిరిగి కదలికలు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆస్పత్రి హైటెక్ సిటీ వైద్యుడు ప్రకాష్ తెలిపారు. గురువారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని యశోద బ్రాంచ్ క్లినిక్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Brachial Plexus | చేతినాడుల మీద తీవ్రమైన గాయం..

బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అంటే చేతి నాడుల మీద(nerve damage) తీవ్రమైన గాయమని వైద్యుడు ప్రకాశ్​ తెలిపారు. ముఖ్యంగా బైక్​ల నుంచి పడిపోయినప్పుడు ఈ గాయాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఇలా చేతి నరాలు దెబ్బతినడం వల్ల బ్రేకియల్ ప్లెక్సస్ ఏర్పడుతుందని, ఇది చేతి నరాలకు సంబంధించిన తీవ్రమైన సమస్య అని, సకాలంలో సర్జరీ చేయించుకుంటే చేతికి కదలికలు, స్పర్శ తిరిగి వస్తుందన్నారు.

చేతిలో కండరాలు బండబారిపోవడం, చేతిలో స్పర్శ లేకపోవడం, కండరాలు పనిచేయకపోవడం, చేయిని పైకి ఎత్తలేకపోవడం లాంటివి జరుగుతుంటాయన్నారు. అలాగే భుజం ఎత్తలేకపోవడం, మోచేయి వంచలేకపోవడం, అరచేతి మూయలేకపోవడం, పూర్తిగా భుజం నుంచి చేతి వరకు నొప్పి రావడం లాంటివి లక్షణాలని, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఏదైనా సందేహం ఉంటే యశోద హాస్పిటల్స్‌ను సంప్రదించవచ్చునని తెలిపారు.

ఇది కూడా చదవండి: Splendor Xtec 2.0 | హీరో నుంచి సూపర్ స్ల్పెండర్​ ఎక్స్‌టెక్ 2.0..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *