అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fake Doctor Arrest | అతడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. కానీ వైద్యుడిగా ప్రజలను నమ్మించి రోగులకు చికిత్స కూడా చేస్తున్నాడు. ఈ నకిలీ వైద్యుడికి వారాసిగూడ పోలీసులు (Warasiguda Police) షాక్ ఇచ్చారు.
హైదరాబాద్ (Hyderabad) నగర పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించి నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. భూపాలపల్లికి చెందిన నన్నుట మాధవ్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం వారాసిగూడలో నివాసం ఉంటున్నాడు. అతడు వైద్యుడిగా పరిచయం చేసుకొని స్థానికంగా మెడికల్ షాపు ముసుగులో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అక్రమంగా వైద్యం చేస్తున్నాడు. అంతేగాకుండా స్థానికంగా ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతున్నాడు. ఆయనను శనివారం వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
Fake Doctor Arrest | మెడికల్ షాపు ముసుగులో..
వారాసిగూడలో మాధవ మెడికల్ షాప్ (Medical Shop) ముసుగులో నడుస్తున్న నిందితుడు క్లినిక్ నిర్వహిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో వైద్యశాలను ఏర్పాటు చేశాడు. ఎలాంటి అధికారిక వైద్య శిక్షణ లేకపోయినప్పటికీ, అతను తన స్నేహితుడు కుంట అర్చనకు చెందిన డ్రగ్ లైసెన్స్‌ను ఉపయోగించి వైద్య వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అతను గత ఏడాదిగా రోగులకు చికిత్స చేస్తూ, ఆ కేంద్రాన్ని అక్రమంగా నిర్వహిస్తున్నాడు.
Fake Doctor Arrest | మందులు స్వాధీనం
నకిలీ డాక్టర్‌పై సమాచారం అందడంతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. సాదా దుస్తులలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్, రోగిగా నటిస్తూ నిందితుడిని సమీపించాడు. నిందితుడు మఫ్టీ అధికారికి ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు దాడి చేసి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో నిందితుడు ఏడాదిగా అక్రమంగా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డైక్లోఫెనాక్, టీటీ (టెటానస్ టాక్సాయిడ్) వంటి షెడ్యూల్డ్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు అంగీకరించాడు. అక్రమంగా నిల్వ ఉంచిన డైక్లోఫెనాక్, టీటీ ఇంజెక్షన్ వయల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీనిని కూడా చదవండి : Hyderabad Land Rover Crash | హైదరాబాద్‌లో ల్యాండ్‌రోవర్ కారు బీభత్సం


