అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: House Fire in Nizamabad | అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) నగరంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
House Fire in Nizamabad | హన్మాన్ నగర్లో..
నగరంలోని పూలాంగ్ సమీపంలోని హన్మాన్ నగరంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో మంటలు లేచాయి. ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు రావడంతో దట్టంగా పొగ నిండుకుంది. స్థానికులు గమనించి వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. స్పందించిన ఫైర్ సిబ్బంది డీఎఫ్‌వో పరమేశ్వర్, జిల్లా ఫైర్ అధికారి శంకర్ నేతృత్వంలో సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Pochampad Road Accident | కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం.. గ్రామస్థుల ధర్నా