అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sanathnagar TIMS | సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. మంత్రి దామోదర రాజనర్సింహతో సోమవారం సాయంత్రం రిబ్బన్ కట్ చేయించారు. రూ.1,126 కోట్లతో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. రోజుకు సుమారు 300 మందికి ఓపీ సేవలు అందించే సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రిలో 1,082 బెడ్లు, 300 ఐసీయూ (ICU)లు, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.
ఆస్పత్రి ప్రారంభం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పేదల ఆరోగ్యం.. తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. ప్రజాపాలనలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నమని చెప్పారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పొందాలని కృషి చేస్తున్నాం అని వెల్లడించారు. జర్మని, సౌత్ కొరియా (South Korea), జపాన్ దేశాల్లో మన నర్సింగ్ విద్యార్థులకు డిమాండ్ ఉందన్నారు. ఆయా భాషలు నేర్చుకొని, అక్కడ ఉపాధి పొందాలని సూచించారు.
Sanathnagar TIMS | వైద్యులకు ఇన్సెంటివ్‌లు
సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువ సేపు పని చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ నిధులు ఇస్తున్నట్లు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్జరీలు చేసే డాక్టర్లు ఇన్సెంటివ్‌లు ఇస్తామన్నారు. దీంతో వారు ఎక్కువ సమయం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సర్కార్ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం కల్పించాలని సూచించారు.
సీఎం మాట్లాడుతూ.. కేటీఆర్ (KTR)పై సెటెర్లు వేశారు. సనత్ నగర్ టిమ్స్ (Sanathnagar TIMS) కట్టామంటున్న కేటీఆర్.. ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు.. ఆస్పత్రుల నిర్మాణాన్ని గాలికి వదిలేశారన్నారు. 2027 డిసెంబర్ 9 లోపల ఉస్మానియా, అల్వాల్, ఎల్బీ నగర్, వరంగల్ ఆసుపత్రులను పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి లెక్కన 16 నెలల్లో 4 ఆసుపత్రులను ప్రారంభిస్తానని ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు మాట్లాడారు.
దీనిని కూడా చదవండి : Ravindra Jadeja | టెస్టుల్లో రవీంద్ర జడేజా రికార్డు