Ponguleti Srinivasa Reddy | ‘ఎస్ఐఆర్’ పెద్ద భూతం.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన ‘ఎస్‌ఐఆర్’ ఒక పెద్ద భూతం లాంటిదని మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ​Ponguleti Srinivasa Reddy | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై పాలేరులో నిర్వహించిన శిక్షణ శిబిరం ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన ‘ఎస్‌ఐఆర్’ ఒక పెద్ద భూతం లాంటిదని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్ ఓట్లు’గా చిత్రీకరించి, వాటిని తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓటరు వయస్సులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా.. వాటన్నింటినీ వంకగా చూపి ఓట్లను లేపేసే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారని వ్యాఖ్యానించారు.

Ponguleti Srinivasa Reddy | తెలంగాణలో సైతం

ఇదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణ (Telangana)లోనూ ప్రయోగించాలని చూస్తున్నారని పొంగులేటి ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. బీజేపీ (BJP) ఓట్లతో పాటు సీట్లను కూడా చోరీ చేస్తుందని ఆయన విమర్శించారు. మీనాక్షి నటరాజన్ కావలసిన ఓట్ల కంటే 11 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా ఒక పాత ఎఫ్‌ఐఆర్ కాగితాన్ని సాకుగా చూపి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారన్నారు.

Ponguleti Srinivasa Reddy | అప్రమత్తంగా ఉండాలి

minister

జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు నిర్వహించే ‘ఓట్ మ్యాపింగ్’ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఉద్యోగాలు, చదువుల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండేవారి ఓట్లు తొలగించే అవకాశం ఉందన్నారు. అధికారులు వచ్చే ముందే గ్రామంలో చాటింపు వేయించి వేరే ఊర్లలో ఉన్న మన ఓటర్లను రప్పించాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : KTR Congress Allegations | మీనాక్షి నటరాజన్ ఓటమి వెనుక కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *