Grain Procurement Failure | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం : బీజేపీ చీఫ్​ రాంచందర్​రావు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Grain Procurement Failure | ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు అన్నారు. ‘రైతు గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం గజ్వేల్​లో (Gajwel) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంది.

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ నిర్లక్ష్య, ఉదాసీన వైఖరి కారణంగా తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని బీజేపీ (BJP) నాయకులు అన్నారు. కొనుగోలు ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం.. భారతీయ జనతా పార్టీ పర్యటనను ప్రకటించిన తర్వాతే అకస్మాత్తుగా ఈ సమస్య తీవ్రతను గుర్తించి నిద్రలేచిందన్నారు.

Grain Procurement Failure | హడావుడిగా..

బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రానికి చేరుకోవడానికి ముందే.. హడావుడిగా ధాన్యాన్ని ఎత్తి లారీల్లో నింపి, అంతా సక్రమంగానే జరుగుతోందనే భ్రమ కల్పించే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. నిన్ననే కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు వచ్చాయని రైతులు తమకు చెప్పారన్నారు. తెలంగాణ రైతుల హక్కుల సాధన కోసం భారతీయ జనతా పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందన్నారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర (MSP) దక్కే వరకు, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ramchandar rao

దీనిని కూడా చదవండి : Farmers Problems | అన్నదాతల అష్టకష్టాలు.. పట్టించుకోని ప్రభుత్వం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *