అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Musi River Project | మూసీ నది ప్రక్షాళనను రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎవరు అడ్డు వచ్చిన ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు.
ఈ మేరకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ అనుమతి లభించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌తో నదికి ఇరువైపులా ఉన్నవారు ఇళ్లు కోల్పోనున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రకటించారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ, పునరావాసం తదితర అంశాలపై సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ నదిని పునరుజ్జీవింపజేసి, దాన్ని పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మార్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశం అన్నారు.
Musi River Project | కాలుష్యానికి చెక్

మూసీ నది కాలుష్యంతో ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి గుర్తు చేశారు. వరదల సమయంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్‌కు సీఎం శ్రీకారం చుట్టారన్నారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వాక్‌వేలు, వినోద కేంద్రాలు ఏర్పాటు ద్వారా మూసీ పరీవాహక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Musi River Project | ఎవరికి వ్యతిరేకం కాదు
మూసీ ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం రాజీ పడబోదని మంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Voter List Revision | ఓట్ల తొలగింపులో వివక్ష.. ఈసీపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు