Telangana Fuel Shortage | తెలంగాణలో పెట్రోలు కష్టాలు.. పెరిగిన డిమాండ్​తో బంకు​ల్లో నో స్టాక్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Fuel Shortage | తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు మూడో రోజుకు చేరాయి. పెట్రోల్​, డీజిల్​ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా ఇంధన డిమాండ్​ పెరడగంతో అనేక బంకుల్లో నో స్టాక్​ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

ఏపీలో మొదట ఇంధన కష్టాలు మొదలు అయ్యాయి. ఆ వార్తలు వ్యాపించడంతో తెలంగాణ (Telangana)లో సైతం ప్రజలు భయంతో అధిక మొత్తంలో పెట్రోల్​, డీజిల్ కొనుగోలు చేశారు. అవసరానికంటే అధికంగా ఇంధనం కొనుగోలు చేశారు. ప్యానిక్​ కొనుగోళ్లతో ఒక్కసారిగా డిమాండ్​ పెరిగింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంక్​ల్లో పెట్రోల్​, డీజిల్​ నిల్వలు అయిపోయాయి. మిగిలిన బంక్​ల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad)​లో పరిస్థితి దారుణంగా ఉంది. తగినన్ని నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. ప్రజలు వినకుండా.. అవసరానికి మించి కొనుగోళ్లు చేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.

Telangana Fuel Shortage | రేట్లు పెరుగుతాయని పుకార్లు

హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల (petrol stations) ముందు నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. పెట్రోల్ రేట్లు పెరుగుతాయనే పుకార్లతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు జనం ఎగబడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని అధికారులు చెబుతున్నారు. పానిక్ కొనుగోళ్లు చేయొద్దని కోరుతున్నారు.

Telangana Fuel Shortage

Telangana Fuel Shortage | సగటు కంటే అధికంగా..

తెలంగాణలో సగటున రోజుకు 5,883 కిలో లీటర్ల పెట్రోల్​, 7,348 డీజిల్​ అమ్మకాలు సాగుతాయి. అయితే సోమవారం 11,490 కిలో లీటర్ల పెట్రోల్​, 18,449 కిలో లీటర్ల డీజిల్​ విక్రయాలు సాగాయి. సాధారణం కంటే భారీగా డిమాండ్​ పెరగడంతో పెట్రోల్​ బంక్​ల్లో నిల్వలు అయిపోయాయి. వాహనదారులు ఆందోళన చెందొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి సద్దుమణుగుతుందని చెబుతున్నారు. కాగా ప్రస్తుతం వరి కోతలు జోరందుకున్నాయి. కోత మిషన్లు, ట్రాక్టర్లకు డీజిల్ అవసరం. అయితే డీజిల్ కొరతతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోంది.

ఇది కూడా చదవండి..: Kaleshwaram Project Probe : కాళేశ్వరం అవినీతిపై విచారణకు సీఎం కీలక నిర్ణయం.. సీబీఐకి లేఖ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *