Midday Meals | విద్యార్థులకు మెనూప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి..

జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్నితయారు చేయాలని కోర్సు డైరెక్టర్ శంకర్ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Midday Meals | జిల్లాలోని పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని(school meal program) తయారు చేయాలని కోర్సు డైరెక్టర్ శంకర్ పేర్కొన్నారు. నగరంలోని(Nizamabad) బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్​ కాంప్లెక్స్​ హెచ్ఎంలకు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు(Midday Meal Agency) జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Midday Meals | నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాల్సిన బాధ్యత మధ్యాహ్న భోజన ఏజెన్సీలపై ఉందని శంకర్ పేర్కొన్నారు. భోజనం తయారు చేయడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తూ ఏరోజుకారోజు నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించేలా కృషి చేయాలని ఆయన కోరారు.

అనంతరం ఇన్​ఛార్జి డీఈవో బాలాజీ మాట్లాడుతూ హెచ్ఎంలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రిసోర్స్ పర్సన్ మురళి, రాంప్రసాద్ మధ్యాహ్న భోజనం తయారు చేయడంలో మేలుకువలను తెలియజేశారు. మధ్యాహ్న భోజనాన్ని వండి చూపించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నరేష్, మధుసూదన్, లింగన్న, సుఖేష్, ఆయా మండలాల ఎంఈవోలు ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు.

govt govt55

ఇది కూడా చదవండి : El Nino Impact | ఎల్‌నినో ఎఫెక్ట్.. దేశంలోని 197 జిల్లాలకు కేంద్రం బిగ్ అలర్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *