అక్షరటుడే, వెబ్డెస్క్: Heavy Rains Alert | రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో బిజీ అయ్యారు. ఎల్నినో ప్రభావంతో కొంతకాలంగా వరుణుడు ముఖం చాటేయడంతో సాగు నెమ్మదించింది. మరోవైపు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో వర్షాలు పడటంతో పంటలకు ఎంతో మేలు చేసింది. వర్షాలతో చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు (Heavy Rains) పడుతాయని అధికారులు చెబుతుండటంతో వానాకాలం పంటలకు డోఖా లేదని రైతులు భావిస్తున్నారు.
Heavy Rains Alert | ఈ జిల్లాలకు అలర్ట్..
జులై 27 నుంచి 30 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాద్, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉంది. 100-120 మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. నల్గొండ, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. వ్యవసాయ పనులకు ఈ వానలు ఎంతో మేలు చేస్తాయి.
ఇది కూడా చదవండి..: Drug Peddler Arrest | డ్రగ్స్ మత్తులో పోలీసులను కారుతో ఢీకొన్న యువకుడు