LPU Classes Cancelled | లవ్లీ ప్రొఫెషనల్​ యూనివర్సిటీలో క్లాసులు రద్దు

లవ్లీ ప్రొఫెషనల్​ యూనివర్సిటీలో 10 రోజుల పాటు తరగతులు రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: LPU Classes Cancelled | పంజాబ్​ (Punjab)లోని లవ్లీ ప్రొఫెషనల్​ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటు యూనివర్సిటీలో తరగతులు రద్దు చేసింది. అంతేగాకుండా మిడ్-టర్మ్ పరీక్షలను వాయిదా వేసింది.

ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 28 నుండి 10 రోజుల పాటు సాధారణ తరగతులు నిలిపి వేస్తున్నట్లు LPU పేర్కొంది. విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సైతం యూనివర్సిటీ అనుమతిచ్చింది. దీంతో సోమవారం ఉదయం పలువురు విద్యార్థులు ఇళ్లకు బయలు దేరారు.

LPU Classes Cancelled | హాస్టళ్లలోనే ఉండాలి

ఇళ్లకు వెళ్లకుండా అక్కడే ఉండే విద్యార్థులు తమ హాస్టళ్లు, నివాసాలకే పరిమితం కావాలని యూనివర్సిటీ సూచించింది. అనవరసరంగా బయట తిరగొద్దని పేర్కొంది. నిరసన కార్యకలాపాల్లో పాల్గొనడం మానుకోవాలని సూచించింది. మరోవైపు విద్యార్థులు 15 గంటలకు పైగా దిగ్బంధించిన పంజాబ్‌లోని ఫగ్వారా వద్ద ఉన్న నేషనల్ హైవే-44పై ట్రాఫిక్​ను పోలీసులు పునరుద్ధరించారు. సోమవారం ఉదయం సైతం క్యాంపస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

LPU Classes Cancelled | విచారణ కొనసాగుతోంది

విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న ఆరోపణలను ఇంకా ధృవీకరించలేదని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల గుర్తింపు ఇంకా తెలియరాలేదన్నారు. ఎస్పీ హరిందర్ గిల్ మాట్లాడుతూ రాత్రి నుంచి పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి నిరసనలు గానీ, మరేమీ జరగడం లేదని తెలిపారు. క్యాంపస్‌లోని అన్ని గేట్ల వద్ద భారీ స్థాయిలో పోలీసులను మోహరించామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: LPU Student Protest | లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్తత.. పోలీసు వాహనాలకు నిప్పు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *