అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BJP Corporators Protest | ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.
BJP Corporators Protest | ధర్నా చౌక్ వద్ద నిరసన..

నగరం (Nizamabad)లోని 60 డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డివిజన్లో సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్పొరేటర్లు ఒక్కసారిగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రప్తమైన పోలీసులు వారిని నిలువరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయిస్తామని వారు నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి..: House Fire in Nizamabad | ఇంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఇద్దరికి గాయాలు..