UPI MDR Charges | ‘యూపీఐ’ ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

యూపీఐ ఎండీఆర్​ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్​బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: UPI MDR Charges | యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఎండీఆర్​ ఛార్జీలు విధించిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

యూపీఐ నుంచి వ్యాపారులకు రూ.2 వేల కంటే ఎక్కువ చెల్లింపులు చేస్తూ 0.4శాతం ఎండీఆర్​ వసూలు చేస్తామని కేంద్రం తెలిపింది. ఈ మొత్తాన్ని వ్యాపారులు భరించాల్సి పేర్కొంది. అయితే వ్యాపారులు దీనిని కస్టమర్లపై వేయడానికి సిద్ధం అయ్యారు. ఈ ఛార్జీలు అక్టోబర్​ 15 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలో రూ. 2000 పైబడిన వాణిజ్య యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను ప్రకటించిన గెజిట్ నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

UPI MDR Charges | స్టే ఇవ్వడానికి నిరాకరణ

కేంద్రం నిర్ణయంపై స్టే ఇవ్వాలని పిటిషనర్​ వాదించారు. అందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. కొత్త ఫ్రేమ్‌వర్క్‌కు ఆధారాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి అఫిడవిట్‌ను కోరింది. అక్టోబరు 15 నుండి అమలులోకి రానున్న ఎండీఆర్​ ఛార్జీలపై న్యాయవాది అంజన్ దత్తా సవాలు చేశారు. ఈ సుంకం విధించడానికి చట్టబద్ధమైన ఆధారం, రూ.రెండు వేల పరిమితి, యూపీఐ, రూపే డెబిట్-కార్డ్ చెల్లింపుల పట్ల చూపుతున్న వివక్షాపూరిత వైఖరిని ప్రశ్నించారు. కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే యూపీఐ బదిలీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొన్నారు. సుమారు 96 శాతం వ్యాపార లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Ujjain Shahi Masjid | రోడ్డు విస్తరణలో మసీదు కూల్చివేతకు యత్నం.. ఉజ్జయినిలో ఉద్రిక్తత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *