Theni sub jail prisoners escape | సబ్‌జైలు సిబ్బందిపై దాడి చేసి.. 17 మంది ఖైదీలు పరారీ.. తమిళనాడులో ఘటన

జైలు వెనుక భాగంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో, ఖైదీలు అడవిలోకి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Theni sub jail prisoners escape | భారతీయ జైళ్ల చరిత్రలో అత్యంత అరుదైన, సంచలనాత్మక సంఘటన తమిళనాడు Tamila nadu లో కలకలం రేపింది. ఖైదీలు తప్పించుకోవడం సినిమా కథలను తలపించేలా పక్కా ప్లాన్‌తో సాగింది. ఒకేసారి ఏకంగా 17 మంది ఖైదీలు జైలు నుంచి ఉడాయించిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. 1995 నాటి సంచలన ఎల్టీటీఈ (LTTE) ఖైదీల పరారీ ఉదంతాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Theni sub jail prisoners escape | మూర్ఛ నాటకంతో మొదలైన ప్లాన్

తమిళనాడులోని తేని జిల్లాలో ఉన్న సబ్‌జైలు నుంచి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ తప్పించుకునే ఘటనకు శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రణాళిక వేసుకున్న ఖైదీలు, తమ సెల్‌లో ఒకరు తీవ్రమైన మూర్ఛతో బాధపడుతున్నట్లు నటించారు. ప్రాణాపాయం అనుకుని ఆందోళనకు గురైన జైలు సిబ్బంది, తక్షణమే ఆ సెల్ తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు.

అదే సమయంలో అదురుపాటులో ఉన్న మిగతా ఖైదీలు ఒక్కసారిగా సిబ్బందిపై విరుచుకుపడ్డారు. సిబ్బందిని తీవ్రంగా కొట్టి, వారిని గదిలో బంధించి జైలు నుంచి పరారయ్యారు. ఈ దాడిలో గాయపడిన సిబ్బందిని తోటి అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Theni sub jail prisoners escape | తేని నుంచి దిండిగల్ వరకు హైఅలర్ట్

ఒకేసారి 17 మంది ఖైదీలు జైలు గోడలు దాటడంతో పోలీసు ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. తేని జిల్లాతో పాటు దిండిగల్ వరకు హైఅలర్ట్ ప్రకటించారు. జైలు వెనుక భాగంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో, ఖైదీలు అడవిలోకి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పరారైన వారిని పట్టుకునేందుకు ఏకంగా 17 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సౌత్ జోన్ ఐజీ విజయేంద్ర బిడారీ తెలిపారు. రాకపోకలను పూర్తిగా నిరోధించేందుకు సుమారు 16 ప్రాంతాల్లో పటిష్టమైన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే గాలింపు చర్యలు వేగవంతం చేసి, ఒక ఖైదీని తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Theni sub jail prisoners escape | 3 దశాబ్దాల తర్వాత అతిపెద్ద ఘటన

తమిళనాడులో ఇటువంటి భారీ పరారీ ఘటన సుమారు మూడు దశాబ్దాల క్రితం చోటుచేసుకుంది. 1995లో వేలూరు కోటలోని ప్రత్యేక నిర్బంధ కేంద్రం నుంచి ఎల్టీటీఈ తీవ్రవాదులుగా భావించిన 43 మంది ఖైదీలు ఏకంగా 153 అడుగుల సొరంగ మార్గాన్ని తవ్వి పారిపోయారు.

అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సరిగ్గా అదే స్థాయిలో మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకే జైలు నుంచి 17 మంది ఖైదీలు ఉడాయించడం ప్రస్తుతం పోలీసు వర్గాలను ఉలికిపడేలా చేసింది. జైళ్ల భద్రతా వైఫల్యాలపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *