Oct 27 Market Analysis | మిక్స్‌డ్​గా ఆసియా మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కానున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 27 Market Analysis | యూఎస్ ఫెడ్(US Fed) సమావేశానికి ముందు యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ నూతన వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఆంత్రోపిక్ ఐపీవో ఫైలింగ్ ఏఐ సంబంధిత స్టాక్స్‌లో సెంటిమెంట్‌ను పెంచడంతో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది.

ప్రధాన ఆసియా మార్కెట్లు మంగళవారం ఉదయం మిక్స్‌డ్ గా కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Oct 27 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.82 శాతం, ఎస్ అండ్ పీ 0.70 శాతం లాభపడగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.15 శాతం లాభంతో ఉంది.

Oct 27 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.90 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.82 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.71 శాతం లాభాలతో ముగిశాయి.

Oct 27 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.06 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.98 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.04 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.01 శాతం లాభంతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.25 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.13 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.46 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 1,462 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా ఐదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,609 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి 94.94 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 114.84 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.61 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.97 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.81 నుంచి 1.11 కు పెరిగింది.
  • విక్స్ 1.78 శాతం పెరిగి 17.16 వద్ద ఉంది.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *