Aug 17 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 17 Market Analysis | గ్లోబల్ మార్కెట్లు (Global markets) మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ నష్టాలతో, యూరోప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. సోమవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి.

గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. ఇది భారత స్టాక్ మార్కెట్ సూచీలకు ప్రతికూల ప్రారంభాన్ని సూచిస్తోంది. ప్రభుత్వ సెలవుదినం కారణంగా దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు సోమవారం మూసి ఉన్నాయి.

Aug 17 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.28 శాతం, ఎస్ అండ్ పీ 0.17 శాతం తగ్గగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.14 శాతం నష్టంతో ఉంది.

Aug 17 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.53 శాతం పెరగ్గా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.21 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.11 శాతం నష్టపోయాయి.

Nag Panchami 2026 | నేడు నాగ పంచమి.. నాగదేవత పూజకు శుభ సమయం, పూజా విధానం ఇదే

Aug 17 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.54 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.45 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.33 శాతం లాభంతో, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.79 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.04 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.14 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభం కానున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 508 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 356 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 95.43 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.52 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.69 వద్ద ఉన్నాయి.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 89.09 డాలర్ల వద్ద ఉంది.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *