Stock Market Losses | నష్టాల్లోనే సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 510 పాయింట్లు, నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో అనిశ్చితి కొనసాగుతోంది. యుద్ధాన్ని ముగించే విషయంలో అమెరికా, ఇరాన్‌లు ఎలాంటి చొరవ చూపకపోవడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ప్రధాన సూచీలు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. ఐటీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది.

Stock Market Losses | నష్టాలతో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) నూతన వారాన్నీ నష్టాలతోనే ప్రారంభించింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 117 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 36 పాయింట్లు పెరిగింది. ప్రాఫిట్ బుకింగ్‌తో ఇంట్రాడే గరిష్టాలనుంచి 460 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 14 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 129 పాయింట్లు తగ్గింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 510 పాయింట్ల నష్టంతో 77,498 వద్ద, నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 24,243 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్స్ లాభాలతో, 24 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 0.56 శాతం, బీఈఎల్ 0.50 శాతం, టైటాన్ 0.30 శాతం, ఎటర్నల్ 0.08 శాతం, ఇండిగో 0.04 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 2.40 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.05 శాతం, టీసీఎస్ 1.78 శాతం, టెక్ మహీంద్రా 1.65 శాతం, హెచ్యూఎల్ 1.33 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Aug 17 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *