Gold Price Today | ఫెడ్ మినిట్స్‌కు ముందు బంగారం ధరలపై ఒత్తిడి.. దేశీయ బులియన్ మార్కెట్‌లోనూ అప్రమత్తత

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Price Today | అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా వడ్డీ రేట్లపై కొనసాగుతున్న అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఈ వారం విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) జూన్ సమావేశ మినిట్స్‌పై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకృతం కావడంతో పసిడి ధరల (Gold Prices)పై ఒత్తిడి నెలకొంది. ఈ ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై కూడా కనిపించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Gold Price Today | విలువైన లోహాలు బలహీనంగా

ఆసియా ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 0.6 శాతం తగ్గి 4,140.88 డాలర్లకు చేరగా, గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం క్షీణించి ఔన్స్‌కు 4,153.19 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. ఇతర విలువైన లోహాలు కూడా బలహీనంగా కనిపించాయి. స్పాట్ సిల్వర్ 1.3 శాతం, ప్లాటినం 0.5 శాతం మేర తగ్గాయి.

ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిలో ఓ నౌకపై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలు ఇంధన సరఫరాపై ఆందోళనలను పెంచాయి. చమురు ధరలు, ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం ఉండొచ్చనే అంచనాలతో అమెరికా డాలర్‌కు మద్దతు లభించగా, బంగారం వంటి విలువైన లోహాలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

ఈ వారం విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ జూన్ సమావేశ మినిట్స్‌పై ప్రపంచ ఆర్థిక మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భవిష్యత్ వడ్డీ రేట్లపై ఫెడ్ ఎలాంటి సంకేతాలు ఇస్తుందన్న అంశమే బంగారం ధరల దిశను నిర్ణయించే కీలక అంశంగా మారింది.

Gold Price Today | అనిశ్చితి కారణంగా

గత వారం అమెరికాలో ఉపాధి గణాంకాలు అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో వడ్డీ రేట్ల పెంపుపై కొంత ఆందోళన తగ్గి బంగారం ధరలు కోలుకున్నాయి. అయితే ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడం, ఫెడ్ కఠిన ద్రవ్య విధానాన్ని కొనసాగించే అవకాశాలపై ఉన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు ఇప్పటికీ ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి.

 Gold Price Today | బంగారం, వెండి ధరల్లో మరింత హెచ్చుతగ్గులు

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పైనా ఉండే అవకాశం ఉందని బులియన్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఫెడ్ మినిట్స్ విడుదల తర్వాత బంగారం, వెండి ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కనిపించే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశీయ బులియన్ మార్కెట్‌లో అంతర్జాతీయ పరిణామాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నేటి బంగారం ధరల ప్రకారం..

ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,740గా కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,810 కాగా, చెన్నైలో అత్యధికంగా రూ.1,45,970గా నదైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,33,710గా ఉండగా, ఇది గత రోజు ధరతో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిలు, వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Mobile Recharge Plans | మొబైల్ యూజర్లకు షాక్.. 15 శాతం వరకు పెరగనున్న రీఛార్జ్ ధరలు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *