Mobile Recharge Plans | టెలికాం రంగంలో పోటీ క్రమంగా తగ్గుతుండటంతో, మొబైల్ టారిఫ్‌లను పెంచేందుకు కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. రానున్న 3 నుండి 4 నెలల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు 12 నుండి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Mobile Recharge Plans | ధరల పెంపునకు కారణాలు..
5G నెట్‌వర్క్ విస్తరణ కోసం టెలికాం సంస్థలు ఇప్పటికే భారీగా ఖర్చు చేశాయి. ఈ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలంటే ధరల పెంపు తప్పదని కంపెనీలు భావిస్తున్నాయి. మార్కెట్‌లో పోటీ తగ్గడంతో, టారిఫ్‌లను పెంచేందుకు ఇప్పుడు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ‘సెంట్రమ్’ నివేదిక వెల్లడించింది.
Mobile Recharge Plans | మార్కెట్లో జియో, ఎయిర్‌టెల్ జోరు..
దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో , భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవడంలో ఈ రెండు కంపెనీలే ముందున్నాయి. ప్రతి త్రైమాసికంలో జియో సుమారు 70 లక్షల మందిని, ఎయిర్‌టెల్ 50 లక్షల మంది కొత్త చందాదారులను ఆకర్షించే అవకాశం ఉంది. వొడాఫోన్ ఐడియా (Vi) కూడా యూజర్లను పొందుతున్నప్పటికీ, జియో ( Jio ) , ఎయిర్‌టెల్ తో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువగా (సుమారు 2 లక్షలు) ఉంటోంది.
Mobile Recharge Plans | పెరగనున్న కంపెనీల ఆదాయం..
వినియోగదారులు పాత 2G నెట్‌వర్క్ నుండి 4G , 5Gకి మారుతుండటం టెలికాం కంపెనీలకు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం దేశంలోని 90 శాతానికి పైగా జిల్లాల్లో జియో, ఎయిర్‌టెల్ 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. 4G, 5G వినియోగం పెరగడం వల్ల డేటా వాడకం భారీగా పెరిగింది. దీని ఫలితంగా టెలికాం కంపెనీల ‘సగటు ఆదాయం’ (ARPU) జూన్ త్రైమాసికంలో 1 నుండి 1.5 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా. మొత్తంగా, త్వరలో రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో మొబైల్ వినియోగదారులు అదనపు భారాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఇది కూడా చదవండి: Telangana Tourism | పురానాపూల్ బ్రిడ్జి ఇక పర్యాటక జోన్.. సీఎం రేవంత్ కీలక ప్రణాళిక