అక్షరటుడే, కామారెడ్డి: Cyber Crime Relief | జీఆర్ఎం, ఎంఆర్ఎం మాడ్యూళ్ల ద్వారా సైబర్ నేర బాధితులకు త్వరితగతిన ఉపశమనం కల్పించాలని కామారెడ్డి పోలీసులు నిర్ణయించారు. ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాలతో సోమవారం జిల్లా సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల సైబర్ వారియర్స్‌కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Cyber Crime Relief | జీఎంఆర్ పోర్టల్ ద్వారా..
సైబర్ నేరాలతో సంబంధం లేకుండా బ్యాంక్ ఖాతాలు లేదా నగదు ఫ్రీజ్ అయిన పౌరులు జీఆర్ఎం పోర్టల్ ద్వారా వినతి సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు. దర్యాప్తు అధికారి బ్యాంకులతో సమన్వయం చేసి నిబంధనల మేరకు అర్హుల ఖాతాలను డీ ఫ్రీజ్ చేస్తారని వివరించారు. సైబర్ మోసాలకు గురై నష్టపోయిన బాధితులకు ఎంఆర్ఎం మాడ్యూల్ ద్వారా రూ.50 వేల లోపు మొత్తాన్ని కోర్టు ఉత్తర్వులు లేకుండానే పరిశీలన అనంతరం తిరిగి అందజేస్తారన్నారు. దీంతో బాధితులకు వెంటనే న్యాయం అందడంతో పాటు కోర్టు ప్రక్రియకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. జీఆర్ఎం, ఎంఆర్ఎం మాడ్యూళ్లను సమర్థంగా వినియోగించి ప్రజల వినతులను సత్వరమే పరిష్కరించాలని, బ్యాంకులు, దర్యాప్తు అధికారులతో సమన్వయం పెంచాలని సైబర్ వారియర్స్‌కు ఎస్పీ ఆదేశించారు. ఈ విధానంతో పోలీసు సేవలు మరింత పారదర్శకంగా ప్రజలకు చేరువుతాయని, తద్వారా శాఖపై ప్రజల విశ్వాసం పెరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండి..: Oil Palm Farming | ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి: షబ్బీర్ అలీ