Lingampet Police | ప్రమాదవశాత్తు వాగులో పడి యువకుడి మృతి

shashi kiran Mottala

అక్షరటుడే, లింగంపేట: Lingampet Police | ప్రమాదవశాత్తు వాగులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన లింగంపేట (lingampet) మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Lingampet Police | ఈ నెల 11న ఇంటి నుంచి వెళ్లి..

ఎస్సై దీపక్ కుమార్ (SI Deepak) తెలిపిన కథనం ప్రకారం.. మంద అనిల్ కుమార్ (28) ఈనెల 11న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అతడికి మూర్ఛ వ్యాధి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

death 1

ఇది కూడా చదవండి: Bandi భగీరథ POCSO Case | విచారణకు రాని బండి భగీరథ్​.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. రేపు భవిష్యత్తు తేలనుందా?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *