MP Arvind | కేసీఆర్ శకం ముగిసింది..: ఎంపీ ధర్మపురి అర్వింద్​

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: MP Arvind | రాష్ట్రంలో కేసీఆర్​ శకం (KCR era) ముగిసిందని.. ప్రజలు ఆయన గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశారని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind)​ అన్నారు. కేసీఆర్​కు మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ మాట్లాడారు.

MP Arvind | రాష్ట్రంలో అధోగతి పాలన

రాష్ట్రంలో సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న పాలన పూర్తిగా అదుపు తప్పిందని అర్వింద్​ విమర్శించారు. రాష్ట్రంలో కరెప్షన్​ తప్ప వేరే ఏదీ జరగట్లేదని ఆయన మండిపడ్డారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్లు అందట్లేదని.. ఉద్యోగులకు పీఆర్సీ (PRC) ఇవ్వట్లేదన్నారు. జనాలను మోసం చేయడం తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకేమీ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే భయపడుతున్నారని.. మంత్రులు అడ్డగోలు కమీషన్లు ఆశిస్తుండడంతో కాంట్రాక్టర్లు ఏ పనికి ముందుకు రావట్లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ రావాలంటే ప్రజలంతా మోదీకి మద్దతు పలకాలన్నారు.

MP Arvind | రూ. 8 వేల కోట్లతో అభివృద్ధి పనులు..

రాష్ట్రంలో సుమారు రూ. 8 వేల కోట్ల నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ (PM Modi) శంకుస్థాపన చేయనున్నారని ఎంపీ తెలిపారు. ఈనెల 10న ఆయా పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. నమ్మిన నాయకులను మోసం చేయడం కేసీఆర్​ను వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇటీవల బీఆర్​ఎస్​లో చేరిన జీవన్​రెడ్డిని సైతం కేసీఆర్​ మోసం చేస్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదని.. రాష్ట్రంలో రైతాంగం నుంచి ఉద్యమం రాబోతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రస్థాయిలో జాప్యం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ధాన్యం కొనుగోళ్లపై కనీసం అవగాహన లేదన్నారు. వారం రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రనాయకుడు సైదిరెడ్డి, బీజీపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి​, ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యానారాయణ (MLA Dhanpal Suryanarayana), జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: TVK Resort Politics| దళపతి ‘రిసార్ట్’ ప్లాన్.. ఫలితాలకు ముందే టీవీకే హై అలర్ట్!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *