Bhu Bharati Resurvey | భూముల రీసర్వేకు సహకరించాలి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కోటగిరి : Bhu Bharati Resurvey | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి కార్యక్రమంలో భాగంగా భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కోరారు. కోటగిరి, ఉమ్మడి పోతంగల్ మండలం (Pothangal Mandal)లోని తిర్మలాపూర్ గ్రామంలో సోమవారం గ్రామస్తులు రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు.

Bhu Bharati Resurvey | ఆధునిక పరిజ్ఞానంతో..

ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆధునిక పరిజ్ఞానంతో పక్కాగా గ్రామాల్లో బౌండరీలు నిర్మిస్తామన్నారు. ప్రతి గ్రామంలో రెండు సమస్యలు ఉంటాయని ఒకటి, గట్టు పంచాయతీ, రెండోది విలేజ్ బౌండరీ సమస్యలను ఉంటాయన్నారు. కాబట్టి వాటి శాశ్వత పరిష్కారం కోసం భూభారతి భూముల రీసర్వే ద్వారా లభిస్తుందన్నారు. మనం పుట్టక ముందు జరిగిన సర్వే అంటే దాదాపు వందేళ్ల క్రితం జరిగిందని వివరించారు. గతంలో ఉన్న సర్వే నంబర్ల పద్ధతి సక్రమంగా లేనందున కొత్తగా ప్రణాళిక ప్రకారం సర్వే నంబర్లు వస్తాయన్నారు.

Bhu Bharati Resurvey | ఆధార్​తో అనుసంధానం..

Bhu Bharati Resurvey

ప్రస్తుతం కొత్తగా సర్వే చేసిన అనంతరం పక్కాగా ఆధార్​తో భూములు అనుసంధానం అవుతాయని.. తద్వారా ఆధార్​ నంబర్​ టైప్​ చేస్తే రాష్ట్రంలో భూములు ఎక్కడున్నా తెలిసిపోతుందన్నారు. సర్వే రోజుల్లో గ్రామస్తులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. సర్వే రిపోర్టు వచ్చిన అనంతరం 60 రోజుల లోపల తప్పులు ఉంటే అప్లై చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం చేసే ఈ సర్వేను ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ సందీప్, సర్పంచ్ బోయి సైదవ్వ, డీఐవోఎస్​ దత్తు, ఎన్ఎస్ఎఫ్ కోర్ కమిటీ సభ్యులు విశ్వనాథ్, సర్వేయర్​ పోశెట్టి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, విజయ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Voter Enumeration Form | ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోపు అందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *