Crematorium Development | హౌజింగ్ బోర్డు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి తొలగిన అడ్డంకులు

పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి అడ్డంకులు తొలిగాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Crematorium Development | పట్టణంలోని (Kamareddy) హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి అడ్డంకులు తొలిగాయని టీపీసీసీ(TPCC) ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కౌన్సిల్(Municipal Council) ఆమోదంతో ప్రభుత్వం ఎన్​వోసీ ఇచ్చిందని తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

Crematorium Development | కామారెడ్డి పట్టణంలో..

కామారెడ్డి పట్టణంలో హౌసింగ్‌బోర్డు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కౌన్సిల్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్మశాన వాటిక అభివృద్ధికి ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ముందుకు వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం శ్మశాన వాటికకు సంబంధించి ఎన్ని ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందో తెలుసుకునేందుకు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సర్వే చేపడతారని తెలిపారు. సర్వే పూర్తయ్యాక అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతారో ప్రజెంటేషన్‌ ద్వారా వివరిస్తారని చెప్పారు. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇందిరానగర్‌ కాలనీలో ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి విషయంలో మరో రెండు స్వచ్ఛంద సంస్థలు, ఇద్దరు వ్యాపారులను సంప్రదించామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Crematorium Development | హౌసింగ్​ బోర్డు వద్ద కాలువలపై..

హౌసింగ్‌ బోర్డు వద్ద కాలువలపై అక్రమంగా కల్వర్టులు నిర్మిస్తున్న వారికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని ఆయన అభినందించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగులు ఎవరి ఒత్తిళ్లకు భయపడొద్దని, ఎవరైనా ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే ఇంచార్జి మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా కామారెడ్డిలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ క్రమశిక్షణా కమిటీ స్పష్టమైన సూచనలు ఇచ్చిందని తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేయాలని సూచించిందన్నారు.

ఎవరినైనా కలిసి పని చేయాలని మాత్రమే పార్టీ సూచిస్తుందని, ఒకరి కింద పని చేయాలని చెప్పదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీ నిర్ణయం మేరకే తాము పనిచేస్తామని, పార్టీ నిర్ణయమే తమకు శిరోధార్యమని చంద్రశేఖర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ మహేష్, డిసిసి ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు పంపరి శ్రీనివాస్, శంకర్ రావు, జమీల్, సలీం, రంగ రమేష్, మామిండ్ల రమేష్, రంగ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Kamareddy Education Hub

ఇది కూడా చదవండి : మూసీ పరివాహక ప్రాంతంలో స్కూల్ బిల్డింగ్ కూల్చివేత 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *