Nizamabad Rural Police Station | నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను సీపీ సాయిచైతన్య బుధవారం తనిఖీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Rural Police Station | నిజామాబాద్(Nizamabad) రూరల్ పోలీస్ స్టేషన్‌ను సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Nizamabad Rural Police Station | సత్వర న్యాయం అందించాలి

సీపీ మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు గౌరవం ఇస్తూ, సమస్యలపై వెంటనే స్పందించి వేగవంతంగా న్యాయం చేయాలని సూచించారు. కేసుల దర్యాప్తు (అండర్ ఇన్వెస్టిగేషన్)లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, మరియు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

సరిహద్దు రహదారులపై నిఘా పటిష్టం చేయాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు (VPO) ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ​రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలను చైతన్యపర్చాలని, సిబ్బంది కూడా బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ​సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ క్రమశిక్షణతో, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు ప్రకాష్ యాదవ్, గురు నాయుడు, రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్, ఎస్సైలు షరీఫ్, ఆనంద్ సాగర్, మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Annapurna Studios’ #Pallaburusu Teaser Out Now.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *