Rashmi Gautham Temple Visit | ​లింబాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నటి రష్మీ గౌతమ్

​ప్రముఖ యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్ సోమవారం భీమ్​గల్​లోని పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Rashmi Gautham Temple Visit | ​ప్రముఖ యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్(Rashmi Gautham) సోమవారం భీమ్​గల్​లోని (Bheemgal) ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆమె ఆలయానికి వచ్చారు.

Rashmi Gautham Temple Visit | ​ఘనస్వాగతం..

ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అర్చక బృందం ప్రణీత్ , విష్ణు, నర్సయ్య, నారాయణ సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ​ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను ఆమెకు వివరించారు. సినీ నటి రాకతో ఆలయానికి వచ్చిన భక్తులు ఆమెను కలుసుకునేందుకు ఉత్సాహం చూపగా, రష్మీ వారిని ఆప్యాయంగా పలకరించారు. ​ఈ దర్శన కార్యక్రమంలో ఆమె వెంట యోగేశ్వర, నర్సయ్య, చింటూ, చందు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: రైతులు నీళ్లు అడిగితే… అరెస్టులా?: రేవంత్ పై కేటీఆర్ ఫైర్ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *