Dinesh kulachari | పీసీసీ చీఫ్​, ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తాం : దినేష్​ కులాచారి

ఆర్మూర్​ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి ఇంటిని ముట్టడిస్తే తామూ సైతం పీసీసీ చీఫ్​, కాంగ్రెస్​ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Dinesh kulachari | ఆర్మూర్​ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి (Mla Rakesh Reddy) ఇంటిని ముట్టడిస్తే తామూ సైతం పీసీసీ చీఫ్​, కాంగ్రెస్​ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని (BJP Warning) బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో (BJP Nizamabad) ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Dinesh kulachari | ఛలో ఆర్మూర్​కు బీజేపీ శ్రేణులూ వెళ్తాయి

రాకేష్ రెడ్డి ఇంటికి ఒక్క కాంగ్రెస్ నాయకుడు వెళ్లినా.. వేలమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు  పీసీసీ చీఫ్​ మహేష్​కుమార్​ గౌడ్​, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి రెడ్డి ఇళ్లను ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నారని దినేష్​ కులాచారి అన్నారు. అవసరమైతే ‘ఛలో ఆర్మూర్’​ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సైతం తాము ప్రణాళిక వేశామన్నారు. అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్​ నాయకులు పోస్టర్లు రిలీజ్​ చేయడం సిగ్గు చేటన్నారు.

Dinesh kulachari | అభివృద్ధి కనిపించడం లేదా?

రూ.200కోట్లతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్​’ ప్రారంభించి పనులను త్వరగా పూర్తి చేయిస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తారా అని ప్రశ్నించారు. అలాగే ఆర్మూర్ నియోజకవర్గంలో 92 గ్రామాలకు 3000 ఇళ్ల మంజూరు చేశారన్నారు. రూ.45 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీని ఆర్మూర్ మున్సిపాలిటీకి ఇచ్చారన్నారు. తెలంగాణ అసెంబ్లీలో గల్ఫ్ కార్మికుల కోసం గొంతు ఎత్తి చనిపోయిన కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు ఇప్పించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్​ స్కీం కింద రూ.43 కోట్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు. డొంకేశ్వర్ మండలం తహశీల్దార్​ కార్యాలయానికి నూతన భవనాన్ని మంజూరు చేయించారన్నారు.

Dinesh kulachari | రూపాయి అవినీతి చేయకుండా..

సుమారు రూ.700 కోట్ల అభివృద్ధి పనులను ఆర్మూర్ ప్రజల కోసం విడుదల చేయించిన రాకేష్ రెడ్డి రూపాయి కూడా అవినీతి లేకుండా మచ్చలేని నాయకుడిగా ఎదిగారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్​ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దె భూమన్న, ప్రధాన కార్యదర్శి పోతంగర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు యాదాల నరేష్, జ్యోతి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓంసింగ్, రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్, సంతోష్ పాల్గొన్నారు.

Paidi Rakesh Reddy

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *