Devineni Avinash | ఎలా పాలించాలో జగన్‌ను చూసి నేర్చుకోండి: దేవినేని అవినాశ్

విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Devineni Avinash | విజయవాడలో ( Vijayawada )ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేసి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Devineni Avinash | ఆరోపణలు..

కృష్ణలంక మాజీ సీఐ వేధింపుల వల్లే క్రాంతి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, బాధిత కుటుంబాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత కనీసం పరామర్శించకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల పట్ల సీఎం చంద్రబాబుకు చిన్నచూపు ఉందని విమర్శించారు.

Devineni Avinash | జగన్ పాలన ..

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందని, సామాన్యులకు రక్షణ కరువైందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి పాలన కంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనే మెరుగ్గా ఉందని ప్రజలు భావిస్తున్నారని, రాష్ట్రాన్ని ఎలా పాలించాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని దేవినేని అవినాశ్ సూచించారు.

ఇది కూడా చదవండి: Jammu Kashmir Flash Floods | జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాలు.. 11 మంది మృతి 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *