FRO Suspended | రూ.50 లక్షల విలువైన సీజ్​ చేసిన సిగరెట్ల విక్రయం.. ఫారెస్ట్​ రేంజ్​ ఆఫీసర్​పై వేటు

సీజ్​ చేసిన సిగరెట్లను విక్రయించిన ఫారెస్ట్​ రేంజ్​ అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: FRO Suspended | స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షల విలువైన సిగరెట్లను ఓ అధికారి విక్రయించాడు. ప్రజారోగ్యానికి హానీ కలిగించే సిగరెట్లను ధ్వంసం చేయాల్సిన ఆయన.. వాటిని విక్రయించి అక్రమ దందాకు తెరలేపాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు ఆయనపై వేటు వేశారు.

చెన్నై నుంచి అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి ఈ సిగరెట్ల సరుకును అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సుమారు ఏడాది క్రితం, భాకరాపేట అటవీ శాఖ చెక్‌పోస్ట్ వద్ద అటవీ అధికారులు ఈ సరుకును అడ్డుకుని, సుమారు రూ. 50 లక్షల విలువైన సిగరెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీన ప్రక్రియను ఫారెస్ట్​ రేంజ్​ అధికారి వెంకటరమణే నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న సరుకును అధికారికంగా భద్రపరచడానికి బదులుగా రహస్యంగా ఇతరులకు ఆయన విక్రయించాడు.

FRO Suspended | డిప్యూటీ సీఎం ఆదేశాలతో..

తిరుపతిలోని జీవకోనకు చెందిన జి. మునిగోపాల్ అనే వ్యక్తి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు విచారణ జరిపారు. స్వాధీనం చేసుకున్న సిగరెట్లను ఎఫ్​ఆర్​వో వెంకటరమణ ఇతరులకు విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ వివరాల ఆధారంగా, రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ వెంకటాచలపతి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి..: Pawan Kalyan Telangana Strategy | పవన్ కళ్యాణ్ తెలంగాణ ‘మిషన్’: Gen-Z మంత్రం వర్కవుట్ అవుతుందా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *