అక్షరటుడే, వెబ్డెస్క్: Nepal Flood Survivors | నేపాల్ (Nepal)లో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆకస్మిక వరదలతో వెయ్యి మందికిపైగా మృతి చెందారు. వేలాది మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 9 రోజుల తర్వాత ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
నేపాల్లోని 12 జలవిద్యుత్ ప్రాజెక్టుల నుండి సుమారు 900 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో దాదాపు 500 మంది సొరంగాలలో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. త్రిశూలిలో శిథిలాల కింద కూరుకుపోయిన ఒక జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుండి తాజాగా ఇద్దరిని సజీవంగా బయటకు తీశారు. దీంతో మరికొందరు లోపల చిక్కుకుపోయి ఉండవచ్చనే ఆశలు బలపడ్డాయి. త్రిశూలి 3A జలవిద్యుత్ ప్రాజెక్టు నుండి బురదతో నిండిన కార్మికులను సహాయక సిబ్బంది భుజాలపై మోసుకెళ్లారు. రక్షించబడిన ఇద్దరిని కబీర్ మహర్జన్, సంజయ్ షాగా గుర్తించినట్లు నేపాల్ హోం మంత్రి సుడాన్ గురుంగ్ తెలిపారు.
Nepal Flood Survivors | ఆస్పత్రికి తరలింపు
సంజయ్ షా నేపాల్ విద్యుత్ అథారిటీ (NEA)లో మెకానికల్ ఫోర్మన్గా పనిచేస్తుండగా, మహర్జన్ త్రిశూలి-3 ‘A’ జలవిద్యుత్ ప్రాజెక్టులో సూపర్వైజర్గా ఉన్నారు. వరదల సమయంలో సొరంగంలో చిక్కుకుపోయిన వీరు తాజాగా ప్రాణాలతో బయట పడటంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రక్షించినప్పుడు షా మాట్లాడే స్థితిలో విమానంలో ఆస్పత్రికి తరలించారు. త్రిశూల్ 3ఏ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని గాలిస్తున్నారు.
Nepal Flood Survivors | 1,259 మంది మృతి
నేపాల్లోని 12 జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద సుమారు 900 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో దాదాపు 500 మంది సొరంగాల్లో చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. సహాయక చర్యలో భాగంగా ఇంజనీర్లు ఆ సొరంగాల్లోకి గాలిని పంపిస్తున్నారు. వరదల కారణంగా 1,259 మంది ప్రాణాలు కోల్పోగా, 5,000 మందికి పైగా గల్లంతయ్యారు.
ఇది కూడా చదవండి..: US-Iran Tensions | ఇరాన్ను కంట్రోల్ చేసేందుకు చాలా మార్గాలున్నాయి : అమెరికా