అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GSLV-F17 Launch | ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన GSLV-F17 రాకెట్ గ్రాండ్ సక్సెస్ అయింది.ఇస్రో శ్రీహరికోట (Sriharikota)లోని సతీశ్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 4వ తెల్లవారుజామున రాకెట్‌ను ప్రయోగించింది.
ఈ ఉపగ్రహం నిర్ణిత కక్షలో ప్రవేశించడంతో విజయవంతం అయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. శత్రు దేశాల కదలికలపై అంతరిక్షం నుంచి నిఘా పెట్టడానికి దీనిని తయారు చేశారు. ఈ రాకెట్ ద్వారా దాదాపు 2,367 కిలోల బరువున్న EOS-05 ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
GSLV-F17 Launch | ప్రత్యేకతలు
ఇది జియోసింక్రనస్ ఆర్బిట్ నుంచి పనిచేసే భారత తొలి డెడికేటెడ్ ఇమేజింగ్ సాటిలైట్. ఒకే ప్రాంతాన్ని తరచూ పరిశీలిస్తూ.. భూమిపై జరిగే మార్పులకు సంబంధించిన చిత్రాలను వేగంగా అందించగలదు. దీంతో దేశ సరిహద్దుల పర్యవేక్షణ, వ్యూహాత్మక అవసరాలు, అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో పరిస్థితులను త్వరగా అంచనా వేయడంలో కీలకంగా ఉపయోగపడనుంది. వ్యవసాయం, సహజ వనరుల పరిశీలన, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి రంగాలకు కూడా EOS-05 సమాచారం అందించనుంది.
GSLV-F17 Launch | అత్యాధునిక శాటిలైట్
ఈఓఎస్-05 ఒక అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం. జియోసింక్రోనస్ కక్ష్య నుండి ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఇది దృశ్య, పరారుణ, బహుళ-స్పెక్ట్రల్ మరియు హైపర్‌స్పెక్ట్రల్ బ్యాండ్‌లలో అధునాతన ఇమేజింగ్‌ను సాధ్యం చేస్తుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇస్రో తన విశ్వసనీయమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రాకెట్ వరుస వైఫల్యాలతో ఎదుర్కొన్న కఠినమైన దశ తర్వాత, తిరిగి ప్రయోగ వేదికపైకి వచ్చింది. ఈసారి, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, GSLV-F17, EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోని దాని గమ్యస్థానానికి విజయవంతంగా తీసుకువెళ్లడంతో హర్షధ్వానాలు వెల్లివిరిశాయి.
GSLV-F17 Launch | ప్రధాని అభినందనలు
ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇస్రో (ISRO) సాధించిన మరో అద్భుతమైన విజయం ఇది; మన దేశానికి ఇది గర్వకారణమైన క్షణం అన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం ‘EOS-05’ను జియోసింక్రోనస్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన GSLV-F17 ప్రయోగం, భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే అత్యుత్తమ పనితీరు, ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.
ఇది కూడా చదవండి..: Arvind Dharmapuri | ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ బిల్ జాయింట్ కమిటీ సభ్యుడిగా అర్వింద్ ధర్మపురి