Hyderabad Crime News|హైదరాబాద్‌లో ఘోరం.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని యువతిపై గ్యాంగ్ రేప్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hyderabad Crime News| సినిమాల్లో , షార్ట్ ఫిలిమ్స్‌లో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు గుర్తుతెలియని యువకులు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఉండే ఓ యువతికి ఆశ చూపారు. అమాయకపు యువతి వారి మాటలను నిజమని నమ్మింది. ఈ క్రమంలో షూటింగ్ స్పాట్‌కు వెళదామని నమ్మించి, ఆమెను సికింద్రాబాద్‌లోని ఒక రహస్య గదికి తీసుకువెళ్లారు.

Hyderabad Crime News|రెండు రోజుల పాటు నరకం..

అక్కడికి తీసుకెళ్లిన తర్వాత యువకుల అసలు స్వరూపం బయటపడింది. ఆ గదిలో యువతిని బంధించి, గత రెండు రోజుల పాటు ఆమెపై వరుసగా క్రూరంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఎంత వేడుకున్నా వినకుండా మృగాళ్లలా ప్రవర్తించారు. అనంతరం, ఈ నెల 16న (మే 16) ఏమీ తెలియనట్టు ఓ ర్యాపిడో (Rapido) బైక్‌ను బుక్ చేసి, ఆమెను అక్కడి నుంచి పంపించేశారు.

Hyderabad Crime News|గాయాలు చూసి గుట్టురట్టు..

నరకం చూసి ఇంటికి తిరిగి వచ్చిన బాధితురాలి ఒంటిపై తీవ్రమైన గాయాలు ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. ఏమైందని ఆందోళనతో గట్టిగా నిలదీయడంతో, ఆ యువతి తనకు జరిగిన ఘోరాన్ని చెప్తూ కన్నీరుమున్నీరైంది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు తక్షణమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. సికింద్రాబాద్‌లోని సదరు గదిని, నిందితులు వాడిన ఫోన్ నంబర్లను ఆధారంగా చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: Dharmapuri Arvind|జగిత్యాల బీజేపీ సీనియర్లపై ఎంపీ అరవింద్ తీవ్ర ఆగ్రహం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *