అక్షరటుడే వెబ్‌డెస్క్: Meta One Subscription | సోషల్ మీడియా దిగ్గజం మెటా తన ప్లాట్‌ఫామ్‌లైన ఇన్‌స్టాగ్రామ్ ( Instagram ), వాట్సాప్, ఫేస్‌బుక్ వినియోగదారుల కోసం సరికొత్త సేవలను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ‘మెటా వన్’ (Meta One) పేరుతో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. డిజిటల్ క్రియేటర్లు, వ్యాపార సంస్థలు , సాధారణ యూజర్లకు అదనపు ఫీచర్లు అందించడంతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని మరింత విస్తృతంగా ఉపయోగించుకునేలా ఈ ప్లాన్లను రూపొందించింది.
అయితే, ఇప్పటివరకు వినియోగిస్తున్న సాధారణ ఫీచర్లు, ఉచిత మెటా ఏఐ సేవలు ఎప్పటిలాగే అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయని మెటా స్పష్టం చేసింది. కేవలం అదనపు ఏఐ సామర్థ్యాలు, కస్టమైజేషన్ , ప్రొఫెషనల్ టూల్స్ కావాలనుకునే వారి కోసమే ఈ పెయిడ్ ప్లాన్లు తెచ్చినట్లు వెల్లడించింది.
Meta One Subscription | భారత్‌లో ధరలు ఇవే..
ఈ ‘మెటా వన్’ సబ్‌స్క్రిప్షన్‌లో ప్రధానంగా మూడు రకాల కేటగిరీలు ఉన్నాయి. సింగిల్ ప్రొడక్ట్ ప్లాన్లు, వ్యక్తిగత ఏఐ పవర్ యూజర్ల కోసం బండిల్స్, అలాగే క్రియేటర్లు-బిజినెస్‌ల కోసం ప్రత్యేక బండిల్స్ అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో వీటికి సంబంధించిన ధరలు ఇలా ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ నెలకు రూ.99, వాట్సాప్ ప్లస్ నెలకు రూ.79, , ఫేస్‌బుక్ ప్లస్ నెలకు రూ.99 ధరలతో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యేక థీమ్స్, కస్టమ్ యాప్ ఐకాన్స్, వాట్సాప్‌లో ఎక్కువ చాట్‌లను పిన్ చేసుకునే వెసులుబాటు, ఇన్‌స్టాగ్రామ్‌లో కస్టమ్ డీఎం, స్టోరీ ఫాంట్స్ వంటి పలు అదనపు ఫీచర్లు యూజర్లకు లభిస్తాయి.
కోర్ (Core) ప్లాన్ నెలకు రూ.549 కాగా, ప్రీమియం (Premium) ప్లాన్ నెలకు రూ.1,950 ధరతో లభిస్తుంది.
అలాగే క్రియేటర్ + బిజినెస్ ప్లాన్లు: ఎసెన్షియల్ (Essential) రూ.639 నుంచి, అడ్వాన్స్‌డ్ (Advanced) రూ.2,099 నుంచి, ఎక్స్‌పర్ట్ (Expert) రూ.6,399 నుంచి, , మాక్స్ (Max) ప్లాన్ రూ.20,990 నుంచి ప్రారంభమవుతాయి.
Meta One Subscription | ఆదాయాన్ని పెంచుకునే దిశగా..
గూగుల్ వన్, ఆపిల్ వన్ తరహాలోనే మెటా కూడా చందాదారుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే ప్రణాళికలు రచిస్తోంది. ఏఐ సాంకేతికత , డేటా సెంటర్ల అభివృద్ధికి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు అవుతుండటంతో.. అధునాతన ఏఐ ఫీచర్లను వాడే వారి నుంచి రుసుము వసూలు చేసి ఆ వ్యయాన్ని భర్తీ చేయాలని టెక్ దిగ్గజాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సబ్‌స్క్రిప్షన్లను ఎడిట్స్, ఏఐ గ్లాసెస్ వంటి మరిన్ని ఉత్పత్తులకు విస్తరించనున్నట్లు మెటా తెలిపింది.
ఇది కూడా చదవండి: Hospital Commission Scam | ఆస్పత్రుల్లో కమీషన్ దందా.. కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలు