అక్షరటుడే,కామారెడ్డి: Ganesh Immersion Route | గణేష్ నిమజ్జనానికి ముందే నిమజ్జన రూటులో ఉన్న లోపాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి పరిశీలించారు.
Ganesh Immersion Route | రైల్వేస్టేషన్ ఎదురుగా..
ముందుగా రైల్వే స్టేషన్ ఎదురుగా పోలీసులు నెలకొల్పిన ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న తర్వాత అధికారులు, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను పరిశీలించారు. ఓల్డ్ బస్టాండ్, ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదుగా ముగింపు ప్రదేశమైన టేక్రియాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌ను స్వయంగా తిరిగి చూశారు. నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, బారికేడ్లు తదితర అంశాలను పరిశీలించి లోపాలను నిమజ్జనానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
Ganesh Immersion Route | నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు..:ఎస్పీ రాజేష్ చంద్ర
నిమజ్జన వేళ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు జరుపుకోవాలని, నిబంధనల ప్రకారం డీజేలపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అడిషనల్ కలెక్టర్ గిరి, డీఎస్పీ మధుసూదన్, టౌన్ సీఐ నరహరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Hospital Commission Scam | ఆస్పత్రుల్లో కమీషన్ దందా.. కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలు