Stock Market Recovery | ఊపిరి పీల్చుకున్న మార్కెట్లు.. లాభాలతో ముగిసిన సూచీలు

గత సెషన్‌లో భారీగా నష్టపోయిన మార్కెట్లు.. బుధవారం ఊపిరి పీల్చుకుని లాభాలతో ముగిశాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Recovery | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరగడం, ఇన్ఫ్లెషన్ భయాలతో 2023 తర్వాత తొలిసారిగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు పెరిగిపోవడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడమÖ దీనికి కారణంగా నిలిచింది.

Stock Market Recovery | వాల్యూ బయ్యింగ్..

గత కొన్ని సెషన్‌లుగా నష్టాలతో కుదేలవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్.. బుధవారం కోలుకుని ఊపిరి పీల్చుకుంది. కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు వాల్యూ బయ్యింగ్‌కు దిగడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఎఫఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల బాట పట్టాయి.

Stock Market Recovery | లాభాలతో ప్రారంభమై..

దేశీయ మార్కెట్లు (Domestic Markets) బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 246 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమైనా కొంత ఒత్తిడిని ఎదుర్కొని 268 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతుగా నిలవడంతో 524 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 85 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 165 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 74,336 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 23,217 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Recovery | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,979 కంపెనీలు లాభపడగా 2,351 స్టాక్స్ నష్టపోయాయి. 231 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 83 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 255 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 18 స్టాక్ లాభపడగా.. 12 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఐటీసీ 2.46 శాతం, ఎస్బీఐ 2.24 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.93 శాతం, ట్రెంట్ 1.51 శాతం, ఎం అండ్ ఎం 1.45 శాతం లాభపడ్డాయి.

Top Losers : టీసీఎస్ 2.60 శాతం, ఇన్ఫోసిస్ 1.43 శాతం, టెక్ మహీంద్రా 1.26 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.99 శాతం, ఎన్టీపీసీ 0.91 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: EPF Wage Limit | ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *