Star Health Camps | ఆరోగ్యమే ధ్యేయంగా ‘స్టార్ హెల్త్’ మెగా క్యాంప్‌లు

ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ 'స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్' తన ప్రస్థానంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం మెగా హెల్త్ క్యాంప్‌లను నిర్వహిస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Star Health Camps | ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ‘స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్’ తన ప్రస్థానంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం మెగా హెల్త్ క్యాంప్‌లను నిర్వహిస్తోంది. వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం , సకాలంలో వైద్య సలహాలు తీసుకోవడం వంటి అలవాట్లను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

Star Health Camps | విస్తృత స్థాయిలో వైద్య సేవలు..

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, హైదరాబాద్, వరంగల్ ( Warangal )  , కరీంనగర్, నిజామాబాద్ , ఖమ్మం వంటి కీలక నగరాల్లో ఈ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు , బహిరంగ ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 5,000 మందికి పైగా ప్రజలు ఈ వైద్య సేవలను అందుకున్నారు. ఇందులో భాగంగా బీఎమ్‌ఐ, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలతో పాటు కంటి, దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని యశోద, కిమ్స్, మెడికవర్, మ్యాక్స్ విజన్, శ్రీకర, క్లోవ్ డెంటల్ , అర్చన హాస్పిటల్స్ వంటి ప్రముఖ వైద్య సంస్థల భాగస్వామ్యంతో చేపడుతున్నారు.
star health.1

Star Health Camps | వర్చువల్ డాక్టర్ సంప్రదింపులు..

సామాన్యులకు వైద్యం మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో, స్టార్ హెల్త్ కస్టమర్ యాప్ ద్వారా 24/7 ఉచిత వర్చువల్ డాక్టర్ సంప్రదింపులను అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకించి వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఇలాంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు సూచిస్తున్నారు.

Star Health Camps | సీఎస్‌ఆర్ ద్వారా ‘ఆరోగ్య సేవ కేంద్ర’లు..

మెగా హెల్త్ క్యాంప్‌లతో పాటు, సంస్థ తన సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ‘ఆరోగ్య సేవ కేంద్ర’ (ASK) క్లినిక్‌లను నిర్వహిస్తోంది. వీటి ద్వారా పేద ప్రజలకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు. విశాఖపట్నం, కర్నూలు, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ , మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ క్లినిక్‌లు నిరంతరం సేవలందిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:  Mudragada Padmanabham | ముద్రగడ పద్మనాభం కన్నుమూత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *