అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HMDA Ravinder Assets | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు (ACB Raids) చేశారు. ఈ సమయంలో భారీగా ఆస్తులను గుర్తించారు.
రవీందర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేశాయి. మైత్రీవనంలోని HMDA ప్రధాన కార్యాలయం, గచ్చిబౌలిలోని సుమధుర టవర్స్‌లో ఉన్న రవీందర్ నివాసం, అలాగే ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై దాడులు జరిగాయి. అధికారులు ఆయన ఇంట్లో కిలో బంగారం, 15 ఫ్లాట్లు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
HMDA Ravinder Assets | అక్రమాస్తుల వివరాలు
రవీందర్‌కు సుమధుర అక్రోపాలీస్లో త్రీ-బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది. శ్రీవారి మెడోస్‌లో ఒక ఫ్లాట్, వాసవీ అట్లాంటీస్లో మూడు ఫ్లాట్లు, కొండాపూర్ (Kondapur)లో 2 ఫ్లాట్లు, జడ్చర్లలో ఏడు ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శంషాబాద్, షాబాద్‌లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, మసీద్ బండలో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం ఉంది.
HMDA Ravinder Assets | భారీగా బంగారం, వెండీ స్వాధీనం
కిలో బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి వస్తువులు, నాలుగు లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బ్యాంక్ లాకర్లకు సంబంధించిన పత్రాలు, 18 సీసాల విదేశీ మద్యం సీజ్ చేశారు. లాకర్లలో బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని, విచారణలో భాగంగా వాటిని త్వరలో తెరుస్తామన్నారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. రవీందర్‌కు సుమారు రూ. 1,16,00,000 విలువైన నాలుగు వాహనాలు ఉన్నాయి.
#Hyderabad– This officer when questioned about certain upcoming projects in HMDA, he showed too much of attitude. Personally happy for the ACB raids
Rs 50 Cr assets seized— of HMDA Chief Engineer Ravinder
Five open plots in three places Kondakal, Kistapur and Pasamala of city… pic.twitter.com/u0EaQmTuqT
— @Coreena Enet Suares (@CoreenaSuares2) July 14, 2026
దీనిని కూడా చదవండి : AE Caught by ACB | రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ