Parawada Pharma City Fire | పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Parawada Pharma City Fire | అనకాపల్లి జిల్లా (Anakapalle District) పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీ దక్షిణ్ ఎనర్జీలో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు.

Parawada Pharma City Fire | గుడిమల్కాపూర్‌లో..

హైదరాబాద్‌ నగరంలోని గుడిమల్కాపూర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వింటేజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో గల చెక్క ఫ్యాక్టరీలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్​లతో మంటలు ఆర్పివేశారు.

ఇది కూడా చదవండి..: Sisters Missing Case | తల్లి మందలించిందని.. ఇంట్లోంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *