అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB DA Case | ఏ శాఖలో చూసినా అవినీతి తిమింగలాలు తిష్ట వేశాయి. లంచాలకు మరిగిన అధికారులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. ఇటీవల ఏసీబీ అధికారుల దాడుల్లో అవినీతి అనకొండల బాగోతం వెలుగు చూస్తోంది. ఎక్కడ సోదాలు చేసిన వందల కోట్ల అక్రమాస్తులు లభ్యం అవుతుండటం రాష్ట్రంలో అవినీతికి అద్దం పడుతోంది.
కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ (Excise Inspector) గుండేటి రాముపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. మార్చి 17న ఆయనపై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు అయింది. తాజాగా ఏసీబీ అధికారులు నిందితుడైన అధికారికి చెందిన జగిత్యాల (Jagtial)లోని భవానీ నగర్, అద్దె ఇంట్లో సోదాలు చేశారు. సోదాల సమయంలో రూ.20.67 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ACB DA Case | బ్యాంక్ ఖాతాల్లో భారీగా డబ్బు
నిందితుడి ఎస్బీఐ (SBI) రూ.29.88 లక్షలు, రాము తండ్రి యూబీఐ ఖాతాలో రూ.16.77 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. రూ.11,97,000 విలువైన ఇతర వస్తువులు, కరీంనగర్ పట్టణంలో రూ.6,05,000/- విలువైన ఖాళీ స్థలం, సిరిసిల్లలో రూ.2,18,484/- విలువైన వాణిజ్య భూమి ఆయన పేరిట ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.87.,44 లక్షలుగా అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. నిందితుడైన అధికారి రాము తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ చరాచర ఆస్తులను కూడబెట్టినట్లు సోదాల్లో వెల్లడైంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Kamareddy Police | హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ అరెస్ట్.. తల్వార్ స్వాధీనం