AE Caught by ACB | రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ ఏసీబీకి చిక్కాడు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: AE Caught by ACB | పెద్దపల్లి (Peddapalli) మున్సిపల్ ఏఈ సతీష్ ఏసీబీకి చిక్కాడు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రతి పనికి రేటు కట్టి వసూలు చేస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్​ మంగళవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

AE Caught by ACB | బిల్లుల కోసం..

ఓ కాంట్రాక్టర్​ చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మున్సిపల్​ ఏఈ సతీష్​​ రూ.4 లక్షల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారు నుంచి మంగళవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికకారులు పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు.

AE Caught by ACB | జోరుగా అవినీతి

రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. పలువురు ఉద్యోగులు ప్రజల నుంచి భారీగా లంచాలు తీసుకుంటున్నారు. ఇంటి అనుమతులు, ఇతర పనుల కోసం డబ్బులు అడుగుతున్నారు. చివరకు బర్త్​ సర్టిఫికెట్​, డెత్ సర్టిఫికెట్ కావాలన్నా.. కొందరు డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Meetings | రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ..కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *