EPF Wage Limit | ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: EPF Wage Limit | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.15,000 నుంచి ఏకంగా రూ.25,000కు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 51 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. పీఎఫ్ పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.11,339 కోట్ల భారం పడుతుందని వివరించారు. ఈ మార్పు సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

EPF Wage Limit | భవిష్యత్ పొదుపు..

గత కొంతకాలంగా ఉద్యోగ సంఘాల నుంచి ఈ డిమాండ్ వ్యక్తమవుతుండగా, ఇన్నాళ్లకు కేంద్రం దీనికి పచ్చజెండా ఊపింది. ఈ తాజా పెంపుదల కారణంగా ఇప్పటివరకు పీఎఫ్ పరిధికి దూరంగా ఉన్న మరికొందరు ఉద్యోగులు కూడా సామాజిక భద్రత పరిధిలోకి రానున్నారు. దీనివల్ల ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు భవిష్యత్ పొదుపు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:  Hospital Commission Scam | ఆస్పత్రుల్లో కమీషన్ దందా.. కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *