అక్షరటుడే వెబ్డెస్క్: Bhatti Vikramarka Congress | గత మూడు టర్ములుగా జాతీయ రాజకీయాలను శాసిస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికలు అంత సులభంగా ఉండబోవనే చర్చ జరుగుతున్న వేళ.. ఏపీ రాజకీయ పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఇండియా’ కూటమిలో చేరే అవకాశం ఉందంటూ వైఎస్ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొచ్చిలో జరిగిన ‘ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2026’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Bhatti Vikramarka Congress | సొంతగూటికి రండి..
ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను వీడి సొంత లేదా ఇతర పార్టీల్లో ఉన్న పాత నేతలందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నట్లు భట్టి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తాను పనిచేశానని గుర్తుచేశారు. వైఎస్ జగన్తో నేరుగా పనిచేయకపోయినా.. పాత నేతలంతా పార్టీలోకి తిరిగొస్తే అత్యంత సంతోషించే వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. జగన్, మమతా బెనర్జీ, శరత్ పవార్ వంటి సీనియర్ నేతలంతా తిరిగి కాంగ్రెస్లోకి రావాలని, దేశ బలోపేతం కోసం మళ్లీ ఒకే వేదికపైకి రావాలని ఆకాంక్షించారు.
Bhatti Vikramarka Congress | ఎలాంటి విభేదాలు లేవు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలూ లేవని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్లో నాయకులను ఎప్పుడూ కులం కోణంలో చూడబోమని తేల్చిచెప్పారు. తెలంగాణలో తామిద్దరం కలిసికట్టుగానే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, నాయకులంతా చర్చించుకుని సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
Bhatti Vikramarka Congress | ఉచితాలు కావు..
తెలంగాణలో అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలు ఉచితాలు కావని, అవి పేదలకు ఆత్మగౌరవాన్ని ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని భట్టి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోందన్నారు.
అలాగే, దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ చెల్లించే ప్రతి రూపాయిలో కేంద్రం నుంచి తిరిగి వస్తున్నది చాలా తక్కువని విమర్శించారు. ఇదే సమయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తూ.. సీఈష్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“I appeal to all the old Congress leaders throughout the country who have left the party: please come and join the Congress party. Let us implement the Congress party’s ideology in this country and strengthen the country,” Bhatti Vikramarka Mallu (Deputy CM, Telangana).… pic.twitter.com/BcdQ9XkybT
— IndiaToday (@IndiaToday) September 30, 2026
ఇది కూడా చదవండి: Subsidized Onion Price | మార్కెట్లో ఉల్లి మంట.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం