KTR Comments | రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కడం కోతికి కొబ్బరిచిప్ప లాంటిది: కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Comments | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  (  Revanth Reddy )వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వెళ్లిన ఆయన, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, తాతా మధులతో సమావేశమై శాసనమండలి పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పదవి దక్కడం “కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు” ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గూండాలను ఉసిగొల్పుతూ ప్రతిపక్షాలపై భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

KTR Comments | కేసీఆర్ నివాసంపై దాడి ..

తెలంగాణను సాధించిన కేసీఆర్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడానికి ప్రయత్నించడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకేనా కేసీఆర్ చనిపోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఏమీ కాదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే రాజకీయంగా చావు తప్పుతుందని హెచ్చరించారు.

KTR Comments | సమాధానం చెప్పలేకే పారిపోతున్నారు..

అసెంబ్లీలో ప్రతిపక్షం లేవనెత్తే ప్రజా సమస్యలు, పాలనా లోపాలపై సరైన సమాధానం చెప్పలేక సీఎం రేవంత్ రెడ్డి పారిపోతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న దోపిడీని, వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని దాడులకు తెగబడ్డా, పోలీసులను ఉపయోగించి అణచివేయాలని చూసినా భయపడేదే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి:  Damodara Rajanarsimha Comments | స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: దామోదర రాజనర్సింహ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *