Ganesh DJ Permission | నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి ఇవ్వాలి : దినేష్​ కులాచారి

వినాయక చవితి సందర్భంగా నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Ganesh DJ Permission | వినాయక చవితి (Ganesh Chaturthi) సందర్భంగా నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి (Dinesh Kulachari) అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ (Peace Committee) సమావేశంలో ఆయన మాట్లాడారు.

Ganesh DJ Permission | ప్రధాన పండుగల నేపథ్యంలో..

ఆయన మాట్లాడుతూ హిందువులు కేవలం వినాయక చవితి, శ్రీరామ నవమి, హనుమాన్ జన్మోత్సవం, దేవీ నవరాత్రులు, ఛత్రపతి శివాజీ జయంతి వంటి ఐదు ప్రధాన పర్వదినాల్లో మాత్రమే సౌండ్ సిస్టమ్ (DJ) ఉపయోగిస్తార్నారు. 2002 ఆగస్ట్​ 30న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిర్దేశించిన పరిమితులకు లోబడి సౌండ్ సిస్టమ్‌కు అనుమతులు మంజూరు చేయాలి తప్ప, ఉత్సవాలను అడ్డుకోకూడదు అన్నారు.

అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (GO) ప్రకారం గణేష్ ఆగమనం, నిమజ్జన ఊరేగింపులకు పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన సీపీ మాట్లాడుతూ.. గణేష్ ఆగమనం, నిమజ్జనం కార్యక్రమాల్లో రెండు స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్‌ (DJ)ను నిబంధనల ప్రకారం వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సినిమా స్టైల్లో చోరీ.. చివరకు..??

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *