Municipal Ganesh Mandali | మున్సిపల్ కార్పొరేషన్ లో గణనాథుడికి ఘనంగా పూజలు..

నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో నగరపాలక సంస్థ గణేష్ మండలి ఆధ్వర్యంలో గురువారం అన్నదానం నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Municipal Ganesh Mandali | నగరం (Nizamabad)లోని మున్సిపల్ కార్పొరేషన్‌లో నగరపాలక సంస్థ గణేష్ మండలి ఆధ్వర్యంలో గురువారం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Municipal Ganesh Mandali | ఉత్సవాలతో సేవా కార్యక్రమాలకు ఊతం..

Municipal Ganesh Mandali

ఈ సందర్భంగా మేయర్ ఉమారాన్ని మాట్లాడుతూ ఉత్సవాలు నిర్వహించడం ద్వారా సేవా కార్యక్రమాలకు నిర్వహించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. నగరపాలక సంస్థ గణేష్ మండలి ద్వారా నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం పేదలు, అవసరమైన వారికి ఆహారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సమాజ సమరసత, సేవా భావం పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని సూచించారు. కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, డీసీసీ ప్రెసిడెంట్ నాగేశ్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Ganesh Shobhayatra | కామారెడ్డిలో నిమజ్జనానికి కదిలిన గణనాథులు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *