Road Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Road Accident | జాతీయ రహదారిపై ( Highway Crash) గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం (Fatal Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Road Accident | డిచ్​పల్లి వద్ద..

డిచ్​పల్లి (Dichpally) వద్ద జాతీయ రహదారిపై కారు బైక్​ను ఢీకొట్టింది. దీంతో బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. అయితే అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం వారి పైనుంచి వెళ్లడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న డిచ్​పల్లి పోలీసులు (Dichpally Police) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

road

Bus Accident

ఇది కూడా చదవండి: Telangana Activists Recognition | అమరవీరుల కుటుంబాలకు సముచిత గౌరవం.. జాబితా తయారీపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *