BC Welfare | జాతీయ బీసీ సంక్షేమ సంఘం రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా గోపాల్ యాదవ్

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్: BC Welfare | జాతీయ బీసీ సంక్షేమ సంఘం రూరల్ నియోజకవర్గ (Rural Constituency) అధ్యక్షుడిగా డిచ్‌పల్లి(dichpally) మండలం సాంపల్లి గ్రామానికి చెందిన సంగి గోపాల్ యాదవ్ నియమితులయ్యారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు గురువారం ఆయనకు జిల్లా కేంద్రంలోని గీత భవన్​లో బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు.

BC Welfare | బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు..

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు, రాజకీయ ప్రాధాన్యత, విద్య, ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ స్థాయిలో బీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. బీసీ జేఏసీ (BC JAC) ఛైర్మన్ పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు, ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధే సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

BC Welfare | బీసీలపై జరుగుతున్న అన్యాయాలను..

సంఘం వైస్ ఛైర్మన్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ బీసీలపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంఘటిత శక్తితోనే హక్కులు సాధించుకోవచ్చన్నారు. నూతనంగా నియమితులైన సంగి గోపాల్ యాదవ్ మాట్లాడుతూ బీసీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కృషి చేస్తానని తెలిపారు. సంఘ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్, బీసీ జేఏసీ కో–ఛైర్మన్స్ పుప్పాల రవి, ఎండల ప్రదీప్, సోమ హనుమంత్ రావు, చింతకాయల రాజు, లక్ష్మణ్ శివాజీ రావు, నవాతే ప్రతాప్, కో కన్వీనర్ నరేందర్, బీసీ జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: CUET UG 2026 | సీయూఈటీ-యూజీ’ కొత్త పరీక్ష తేదీలు ఖరారు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *