అక్షరటుడే, కామారెడ్డి: Indiramma House Money Fraud | ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన డబ్బులు పోస్ట్ ఆఫీస్ ఖాతా నుంచి మాయమయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డి(machareddy) మండలంలో చోటుచేసుకుంది.
Indiramma House Money Fraud | మాచారెడ్డిలోని ఘన్పూర్..
మాచారెడ్డి ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన 60 ఏళ్ల భూక్య రేణుకకు పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఉంది. రేణుక తన అవసరాలకు ఖాతాను వాడుకుంటుంది. ఇటీవల తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, ఇంటి నిర్మాణానికి సంబంధించిన డబ్బులు అదే ఖాతాలో పడ్డాయి. డబ్బులు ఖాతాలో ఉన్నాయి కదా అని ఆ డబ్బులు తీసుకునేందుకు పోస్ట్ ఆఫీస్కు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేకపోగా, పేటీఎం యాప్ ద్వారా వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి. మొత్తం రూ.91,101 రేణుక పోస్ట్ ఆఫీస్ ఖాతా నుంచి పేటీఎం ద్వారా వేరే ఖాతాకు వెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వృద్ధురాలి పోస్టాఫీసు ఖాతా నుంచి నగదు మాయమైన విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఎవరికీ ఓటీపీలు చెప్పవద్దని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..