Dangerous U-turn | ప్రమాదకరంగా డివైడర్​.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు

కామారెడ్డిలోని నిజాంసాగర్​ చౌరస్తా వద్ద యూ టర్న్​ ప్రమాదకరంగా మారింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Dangerous U-turn | పట్టణం (Kamareddy)లోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన యూటర్న్ వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. దీంతో నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

Dangerous U-turn | బస్టాండ్​కు వెళ్లే దారిలో..

చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వైపు వెళ్లే దారిలో గతంలో పాత బస్టాండ్ వైపు వెళ్లేందుకు యూటర్న్ ఉండేది. ట్రాఫిక్ సమస్య కారణంగా పోలీసులు ఆ దారిని మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నిజాంసాగర్ చౌరస్తాలో పని ఉండే వాహనదారులు మున్సిపల్ ఆఫీస్​ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ చౌరస్తా వద్దకు రావడం ఇబ్బందిగా మారింది. దీంతో చౌరస్తాకు కాస్త ముందే డివైడర్‌ను తొలగించి యూటర్న్​కు వెసులుబాటు కల్పించారు. అయితే డివైడర్ తొలగించిన చోట రోడ్డు మధ్యలో బేస్‌మెంట్ ఎత్తుగా ఉండి, రోడ్డు లెవల్ చేయకపోవడంతో ఆ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. యూటర్న్ తీసుకునే క్రమంలో వాహనాలు మధ్యలోనే ఆగిపోవడం, అదుపుతప్పి పడిపోవడం జరుగుతోంది.

రెండు రోజుల క్రితమే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై యూటర్న్ తీసుకుంటూ కిందపడిపోయారు. అదృష్టవశాత్తు వెనుక నుంచి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ నుంచి నిజాంసాగర్ వైపు వచ్చే వాహనాలు ఈ యూటర్న్ వద్ద వాహనాలను ఢీకొనే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివైడర్ తొలగించి దారి ఇచ్చినప్పుడు అక్కడ సిమెంట్ లేదా బీటీ వేసి రోడ్డును లెవల్ చేసి ఉంటే ఈ ప్రమాదాలు జరిగేవి కావని వాహనదారులు అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఆ ప్రమాదకర యూటర్న్ వద్ద రోడ్డును లెవల్ చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

rakesh 2

ఇది కూడా చదవండి..: Ganesh Immersion Celebrations | సమన్వయంతో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *