అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bihar Girl Harassment Case | బీహార్ (Bihar)లో మహిళలు , బాలికలపై వేధింపులకు సంబంధించిన ఘటనలు వరుసగా వెలుగు చూస్తూ తీవ్ర కలకలం రేపుతున్నాయి.
రాష్ట్రంలో వరుసగా ఇలాంటి అమానుష ఘటనలు బయటికి వస్తుండటంతో అసలు అక్కడ ఏం జరుగుతోందంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బాంకా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మందార్ పర్వత్‌లో ఓ బాలికను కొందరు యువకులు వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Bihar Girl Harassment Case | వైరల్ వీడియో..
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో కొందరు యువకులు బాలిక చుట్టూ చేరి అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక యువకుడు బాధితురాలి చేతిని పట్టుకుని మెలితిప్పగా, మరో వ్యక్తి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో ఉందని పోలీసులు తెలిపారు. మరో యువకుడి చేతిలో కర్ర కూడా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోకు అల్లరిని, దౌర్జన్యాన్ని ప్రోత్సహించేలా ఉండే ఒక నేపథ్య సంగీతాన్ని (మ్యూజిక్) జోడించి మరీ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసినట్లు తేలింది.
Bihar Girl Harassment Case | ఆరు నెలల క్రితం నాటి ఘటనా?
ఈ వీడియోపై సెప్టెంబర్ 3 అనే తేదీ కనిపిస్తున్నప్పటికీ, ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఇది సుమారు ఆరు నెలల క్రితం తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 22న బౌన్సీ పోలీస్ స్టేషన్ సోషల్ మీడియా సెల్‌కు వాట్సాప్ ద్వారా ఈ వీడియో చేరింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు బృందం మందార్ పర్వత్‌కు వెళ్లి వీడియోలో ఉన్న ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. వీడియో ఎప్పుడు తీశారు, అందులో ఉన్న వ్యక్తులు ఎవరనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
Bihar Girl Harassment Case | ఆరుగురి పై ఎఫ్‌ఐఆర్..
వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆరుగురు గుర్తుతెలియని యువకులపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ యాక్ట్‌లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు బౌన్సీ ఎస్‌డీపీవో ఇంద్రజిత్ బైఠా తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, దర్యాప్తు పూర్తయిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Bihar Girl Harassment Case | వరుస ఘటనలు..
బాంకా ఘటన వెలుగులోకి రావడానికి కొద్ది రోజుల ముందు బీహార్‌లోని జముయి, సమస్తిపూర్ జిల్లాల్లోనూ ఇలాంటి వేధింపుల వీడియోలే కలకలం రేపాయి. సమస్తిపూర్ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా, జముయిలో కోచింగ్ నుంచి వస్తున్న పదో తరగతి బాలికపై దాడి చేసిన ఘటనలోనూ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముజఫర్‌పూర్‌లోనూ ఓ బాలికను వేధించిన ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు. మరోవైపు మధేపురాలో వైరల్ అయిన వీడియో విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదానికి సంబంధించినదని పోలీసులు స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, బీహార్‌లో వరుసగా వెలుగు చూస్తున్న ఈ అఘాయిత్యాల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
డబుల్ ఇంజిన్ సర్కార్‌లో మరో దారుణం
టూరిస్ట్ స్పాట్‌లో ఓ అమ్మాయిపై దాడి చేసిన ఆరుగురు దుండగులు
బీహార్ బంకా జిల్లాలోని మందర్ హిల్ అనే టూరిస్ట్ స్పాట్‌కు తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిన ఓ యువతి
ఇంతలోనే అక్కడికి ఆరుగురు దుండగులు చేరుకొని.. వారిపై వేధింపులు
ముఖ్యంగా.. యువతి పట్ల… https://t.co/aScrhYWufz pic.twitter.com/Y6IWLvG6Tf
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 25, 2026
ఇది కూడా చదవండి..: Gyanesh Kumar Supreme Court Plea | ఓటర్ల సవరణ వివాదం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్